డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయడం తప్పనిసరి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: India
దేశవ్యాప్తంగా ఉన్న వాహనదారులకు కేంద్ర రవాణా శాఖ కీలక సూచనలు జారీ చేసింది. డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలని, సెప్టెంబర్ 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఒకవేళ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్‌లు రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. వాహనదారులు ఎలాంటి రుసుము చెల్లించకుండా ఇంటి నుంచే సారథి పోర్టల్ ద్వారా ఉచితంగా ఈ మొబైల్ నంబర్ అప్డేట్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.