విశాఖలో వినాయక నిమజ్జనానికి పటిష్ట పోలీసు బందోబస్తు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలో వినాయక చవితి వేడుకలు మరియు నిమజ్జనాల సందర్భంగా నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీపీ ఆదేశాల మేరకు నిమజ్జన ప్రాంతాలు, ఊరేగింపు రహదారుల్లో సామాన్య ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. తీర ప్రాంతాలలో భద్రత కోసం ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను, క్రేన్లను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు.