విద్యార్థులకు గుడ్ న్యూస్: కృత్రిమ మేధ యుగానికి తగినట్లుగా బిట్స్ పి నూతన కరిక్యులమ్
రిపోర్టర్: రాము
స్థలం: Pilani
కృత్రిమ మేధ యుగానికి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు బిట్స్ పి తన అండర్ గ్రాడ్యుయేట్ కరిక్యులమ్‌ను పూర్తిగా మార్పులు చేసినట్లు గ్రూప్ వైస్ ఛాన్సలర్ వి. రాంగోపాల్ రావు వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానంలో వస్తున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు మరింత అకడమిక్ ఫ్లెక్సిబిలిటీని కల్పిస్తున్నామని, రీసెర్చ్ మరియు ఇండస్ట్రీ ప్రాక్టీస్‌కు పెద్దపీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. నూతన విధానం ద్వారా విద్యార్థులకు స్వతంత్రంగా ఆలోచించే నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు.