అరసవల్లి దేవస్థాన అభివృద్ధికి కోట్లు మంజూరు చేసిన కేంద్రం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: శ్రీకాకుళం

ప్రసిద్ధ సూర్యక్షేత్రమైన శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థాన సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం స్వదేశ్ దర్శన్ పథకం కింద యాభై ఐదు కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల కేటాయింపు పట్ల మంత్రి అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.