బాలీవుడ్ స్టార్ హీరో సరసన ప్రగ్యా జైస్వాల్ సూర్య చిత్రం
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న సూర్య చిత్రంలో హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. నవంబర్ ఇరవయ్యవ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.