స్వామి వివేకానంద స్ఫూర్తితో దేశాభివృద్ధికి కదలాలి
రిపోర్టర్: Y.V.RAMANA
స్థలం: అమలాపురం
అమలాపురం పట్టణంలో బీజేవైఎమ్ గోదావరి జోన్ ఇంచార్జ్ ఈశ్వర్ గౌడ్ అధ్యక్షతన అంతర్జాతీయ సర్వమత సమ్మేళనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సేవా భారతి సేవా సంపర్క ప్రముఖ్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద చికాగో సమ్మేళనంలో భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటారని తెలిపారు. వివేకానంద స్ఫూర్తితో యువత దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు సుబ్బారాయుడు, వివేకానంద సేవా సమితి సభ్యులు గనిశెట్టి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.