మెరకముడిదాంలో తెదేపాలోకి భారీ వలసలు: వైకాపాకు బొత్స నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ

రిపోర్టర్: సతీష్ స్థలం: విజయనగరం

స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లి పరిధిలోని మెరకముడిదాం మండలంలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు తెలిపారు. మంగళవారం చినబంటుపల్లిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోట్ల వెంకటరావు, మాజీ సర్పంచి బూర్లె నరేష్ ఆధ్వర్యంలో రెండు వేల మందికిపైగా కార్యకర్తలు ఆయన సమక్షంలో తెదేపాలో చేరారు.