చీకటి కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న పల్లెసీమల ఆక్రోశం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: నరసన్నపేట
నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలో గత సంవత్సరం కాలంగా సరైన వీధిలైట్లు లేక రాత్రివేళల్లో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చీకటి కారణంగా రోడ్లు సరిగ్గా కనిపించక ప్రయాణికులు, పాదాచారులు భయాందోళనలకు గురవుతున్నారు. కొద్ది రోజుల క్రితం అధికారులు హడావిడి చేసి లైట్లు బాగు చేస్తున్నామని చెప్పినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి మారలేదని ప్రజలు వాపోతున్నారు. అసాంఘిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.