స్టార్ హీరో కుమారుడితో అనన్య పాండే డేటింగ్: నెట్టింట ఫొటోలు వైరల్

రిపోర్టర్: నరేష్ స్థలం: ముంబై

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమారుడు ఆరవ్ భాటియాతో నటి అనన్య పాండే డేటింగ్లో ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం సాగుతోందని మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇటీవల లండన్ వెకేషన్లో తమ స్నేహితులతో కలిసి ఉన్న ఈ యువ జంట ఫొటోలు నెట్టింట వైరల్గా మారడంతో ఈ వార్త తెరపైకి వచ్చింది. అయితే ఈ వైరల్ అవుతున్న డేటింగ్ వార్తలపై అటు అనన్య పాండే గానీ, ఇటు ఆరవ్ భాటియా గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.