'కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న చంద్రబాబు': వారణాసిలో సీఎం ప్రత్యేక పూజలు
రిపోర్టర్: రాము
స్థలం: వారణాసి
ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు మరియు ప్రజాసేవకు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వారణాసిలోని కాశీ విశ్వనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోడీ ప్రజాజీవిత ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వారణాసి వడ్నగర్ సేవా యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ నుండి వారణాసి చేరుకున్న చంద్రబాబు, రుద్రాక్ష కన్వెన్షన్ సెంటర్లో జరిగిన సేవాయాత్రలో భాగస్వామ్యమయ్యారు.