నెల్లూరులో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారు ఆభరణాలు చోరీ
రిపోర్టర్: శివ
స్థలం: నెల్లూరు
నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పరిధిలోని శాంతినగర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు 98 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించుకెళ్లారు. శాంతినగర్‌కు చెందిన సాయి సందీప్ దంపతులు ఉద్యోగాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరచి ఉండి వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.