ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల: భారత్తో బంగ్లాదేశ్ పోరు

రిపోర్టర్: కృష్ణ స్థలం: Punjab

ఆసియా హాకీ ఫెడరేషన్ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2026 షెడ్యూల్ను విడుదల చేసిందని అధికారులు తెలిపారు. పంజాబ్లోని జలంధర్ మరియు మోహాలీ వేదికలుగా అక్టోబర్ 27 నుంచి నవంబర్ 5 వరకు ఈ టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లేకుండా విడుదల చేసిన ఈ షెడ్యూల్లో బంగ్లాదేశ్కు చోటు దక్కింది. భారత్ తన తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుందని నిర్వాహకులు వెల్లడించారు. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న భారత జట్టు మరోసారి ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఉత్సాహంగా ఉంది.