ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలకు నగర పోలీస్ కమిషనర్కు అధికారిక ఆహ్వానం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: ఎన్టీఆర్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల పదకొండు నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీదేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర బాబుకు దేవస్థానం అధికారులు ఆహ్వానం అందజేశారు. ఈ మేరకు దేవస్థానం ఈఓ శీనా నాయక్, ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందించినట్లు విజయవాడ సిటీ పోలీస్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలను సమర్పించారు.