మణిపూర్ లో తీవ్ర కాల్పుల కలకలం: నలుగురు మిలిటెంట్లు దుర్మరణం
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఇంఫాల్
మణిపూర్ రాష్ట్రంలోని నోనీ జిల్లాలో రెండు ప్రత్యర్థి నాగా మిలిటెంట్ వర్గాల మధ్య జరిగిన భీకర కాల్పుల్ లో నలుగురు మిలిటెంట్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. టావోడైజింగ్ గ్రామంలో జెడ్యూఎఫ్, ఎన్ఎస్సీఎన్-ఐఎం వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనతో తీవ్ర భయాందోళన చెందిన స్థానిక గ్రామస్తులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఘర్షణల నేపథ్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు, ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.