గిద్దలూరులో అద్భుతం: పోలేరమ్మ అమ్మవారికి అదనపు నేత్రాలు!

రిపోర్టర్: రాజేష్ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టంశెట్టిపల్లె శ్రీ పోలేరమ్మ ఆలయంలో వార్షికోత్సవాల సందర్భంగా అద్భుతం చోటుచేసుకుంది. అమ్మవారి విగ్రహంపై రెండు సాధారణ కళ్లతో పాటు మరో రెండు అదనపు కళ్లు స్పష్టంగా కనిపించాయి. ఈ వింత దృశ్యాన్ని దైవలీలగా భావిస్తున్న భక్తులు ఉద్వేగానికి లోనవుతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.