కొత్తపట్నం తీరంలో ఘోరం: బోటు బోల్తా పడి నలుగురు మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: ప్రకాశం

ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్ర తీరంలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మత్య్సకారులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉధృతికి బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పడవలో నలుగురు మృతదేహాలు లభించగా, మరో పదకొండు మందికి పైగా గల్లంతయ్యారు. మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ బృందాలు సముద్రంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.