సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హత్య కేసులో గుజరాత్లో మరో ఇద్దరు అరెస్ట్

రిపోర్టర్: హరి స్థలం: Amritsar

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మాద్ సంధు హత్య కేసులో గుజరాత్లో మరో ఇద్దరు నిందితులను అమృత్సర్ పోలీసులు అరెస్ట్ చేశారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో అరెస్టయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరిందని తెలిపారు. నిందితులు హర్సిమ్రాన్ సింగ్, ఫతే సింగ్లుగా గుర్తించారు. గత అక్టోబర్ మూడో తేదీన అమృత్సర్లోని లోహర్కా రోడ్డులో మాద్ సంధును దుండగులు కాల్చి చంపారు. విదేశాల్లోని గ్యాంగ్స్టర్లతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.