అల్లు అర్జున్ 'రాకా' సినిమాకు మాస్టర్ ప్లాన్!

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో వస్తోన్న భారీ పాన్ ఇండియా చిత్రం 'రాకా'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా కోసం బన్నీ తన ముంబై పీఆర్ టీమ్‌తో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సాధారణ సినిమాలలా కాకుండా, విడుదలైన సరిగ్గా ఏడాది ముందే దశలవారీగా ప్రమోషన్స్ ప్రారంభించి, గ్లోబల్ రీచ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ హైప్ క్రియేట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.