అమెరికాలో అట్లాంటా తెలుగు సంఘం ఆధ్వర్యంలో రెండో పికిల్బాల్ టోర్నమెంట్ నిర్వహణ

రిపోర్టర్: సురేష్ స్థలం: అమెరికా

అమెరికాలోని ప్రవాస తెలుగు క్రీడాకారుల కోసం అట్లాంటా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ పదవ తేదీన ప్రతిష్టాత్మకమైన రెండో పికిల్బాల్ టోర్నమెంట్ను నిర్వహించనున్నట్లు టామా ప్రెసిడెంట్ సునీత పొట్నూరి, స్పోర్ట్స్ సెక్రటరీ హరికృష్ణ అద్దంకి తెలిపారు. జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టా ప్రాంతంలో ఈ పోటీలు జరగనున్నాయని, ఆసక్తి గల వారు అధికారిక వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని వారు కోరారు.