ఆమనగల్లు సమీపంలో ఆటో ఢీకొని కార్యదర్శికి తీవ్ర గాయాలు

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ఖానాపూర్ పలుగుగుట్ట సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్జాల్ గ్రామపంచాయతీ కార్యదర్శి వాజీద్ బైక్పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయనకు తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన 108 సిబ్బంది క్షతగాత్రుడిని ఎన్నం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.