కల్లు ధర పెంపుపై ఆగ్రహం: చెప్పుదెబ్బలు, జరిమానా అంటూ వినూత్న నిరసన

రిపోర్టర్: సతీష్ స్థలం: మెదక్ జిల్లా

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో కల్లు ధర పెంపుపై గ్రామస్థులు వినూత్న రీతిలో నిరసన తెలిపినట్లు స్థానికులు వెల్లడించారు. దుకాణంలో గతంలో పదిహేను రూపాయలుగా ఉన్న ఒక సీసా కల్లు ధరను ఇరవై రూపాయలకు పెంచడంతో ఆగ్రహానికి గురైనట్లు పేర్కొన్నారు. పెంచిన ధరకు ఎవరైనా కల్లు తాగి దొరికితే ఐదు చెప్పుదెబ్బలతో పాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామంటూ గ్రామస్థులు ఏకంగా హెచ్చరికల బ్యానర్లు ఏర్పాటు చేయడంతో ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.