ఖైరతాబాద్ వివాదం: కోర్టు తీర్పు వచ్చే వరకు ఉప ఎన్నిక వద్దు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ వివాదంపై కాంగ్రెస్ నాయకురాలు పి.విజయారెడ్డి స్పష్టం చేశారని, కోర్టు పరిధిలో ఉన్న అంశంపై బహిరంగ చర్చ సరికాదని ఆమె తేల్చిచెప్పారు. ఎన్నికల పిటిషన్ పెండింగ్లో ఉన్నందున ఉప ఎన్నిక నిర్వహించలేమని ఈసీ స్పష్టం చేసిందని గుర్తుచేశారు. దానం నాగేందర్ వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదని, తుది తీర్పు వెలువడే వరకు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈసీని కోరినట్లు విజయారెడ్డి వెల్లడించారు.