భారత్ స్విట్జర్లాండ్ ద్వైపాక్షిక సంబంధాలపై విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి హర్షం

రిపోర్టర్: అశోక్ స్థలం: ఎన్టీఆర్

భారత్ మరియు స్విట్జర్లాండ్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ ఉత్పత్తి అలాగే అణుశక్తి రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, స్విస్ అధ్యక్షుడు పర్మెలిన్ గారితో జరిపిన కీలక చర్చలు ద్వైపాక్షిక భాగస్వామ్యానికి నూతన దిశను నిర్దేశిస్తాయని వై.ఎస్. చౌదరి (సుజనా చౌదరి) - ఎమ్మెల్యే విజయవాడ పశ్చిమ వెల్లడించారు. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఉన్నత స్థాయి ఒప్పందాలు భవిష్యత్తులో దేశ ఆర్థికాభివృద్ధికి మరియు సాంకేతిక పురోగతికి ఎంతో దోహదపడతాయని ఆయన తెలిపారు.