ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద దిగువకు భారీగా నీటి విడుదల
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయవాడ
విజయవాడ ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీకి 40,521 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అధికారులు అప్రమత్తమై 36,250 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా పశ్చిమ డెల్టాకు 4,012 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్‌కు 239 క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు. వరద ఉధృతిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ, దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.