బడి పిల్లల ఆకలి తీర్చే నూతన అధ్యాయానికి శుభారంభం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: హుస్నాబాద్

తెలంగాణ ప్రభుత్వం మరియు హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిరంతర ఉపహారం అందించేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా కరీంనగర్ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన భారీ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఈ భారీ వంటశాల యంత్రాలను మరియు నాణ్యతా ప్రమాణాలను వారు క్షుణ్ణంగా పరిశీలించి అభినందించారు.