పేదలకు ఇందిరమ్మ ఇండ్ల టవర్స్: మేడ్చల్లో అట్టహాసంగా శంకుస్థాపన
రిపోర్టర్: రాజేష్
స్థలం: కుత్బుల్లాపూర్
పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద పాల్గొన్నారు. పారదర్శకంగా లాటరీ ద్వారా నూట ఎనభై మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని, పన్నెండు నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేసి తాళాలు అందిస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.