'నగరాల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కావాలి': న్యూఢిల్లీ సదస్సులో కేటీఆర్

రిపోర్టర్: కిరణ్ స్థలం: న్యూఢిల్లీ

న్యూఢిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్‌లో 'జనాగ్రహ' ఆధ్వర్యంలో జరిగిన 'షెహరోంపే చర్చ' అఖిలపక్ష సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్‌పై ఒత్తిడి తగ్గించేందుకు, సమాంతర ఆర్థిక వృద్ధి సాధించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పాలనా వికేంద్రీకరణ చేపట్టామని, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మహువా మాజి, ఎస్ నిరంజన్‌రెడ్డి, జనాగ్రహ సీఈవో శ్రీకాంత్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.