వైద్య రంగంలో అరుదైన మైలురాయి: ఉస్మానియాలో పందొమ్మిది లింగమార్పిడి సర్జరీలు పూర్తి

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

హైదరాబాద్లోని ప్రముఖ ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్య రంగంలో అరుదైన మైలురాయిని చేరుకుందని ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్ డాక్టర్ పడమట లక్ష్మి తెలిపారు. గడిచిన ఎనిమిది నెలల వ్యవధిలో ఎటువంటి ఆర్థిక భారం లేకుండా సీఎంఆర్ఎఫ్ మరియు ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా పందొమ్మిది లింగమార్పిడి సర్జరీలను పూర్తిగా ఉచితంగా విజయవంతంగా నిర్వహించినట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షలాది రూపాయలు ఖర్చయ్యే ఈ అత్యంత క్లిష్టమైన వైద్య సేవలను ఇక్కడ ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.