నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని మాధవ్ విజ్ఞప్తి
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి తరఫున బరిలో నిలిచిన ఛైర్మన్ అభ్యర్థి మైపాడ ప్రసాద్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. జరజాపుపేటలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి జోరుగా సాగుతోందని, ప్రజలంతా కూటమి అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి సహా పలువురు ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.