జీ5లో నేటి నుంచి ఉదయభాను 'పంచనామా' వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
ప్రముఖ యాంకర్ ఉదయభాను నిర్మాతగా వ్యవహరిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ 'పంచనామా'. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ నేటి నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించనుంది. నిర్మాతగా మారాలన్నది తన 15 ఏళ్ల కల అని ఉదయభాను తెలిపారు. నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో ఈ సిరీస్ అద్భుతమైన థ్రిల్ పంచుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది.