నీట్ పీజీ జవాబుల కీ వెల్లడిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: New Delhi
నీట్ పీజీ పరీక్షల జవాబు పత్రాల కీ ని పూర్తిగా వెల్లడించకపోవడంపై జాతీయ వైద్య పరీక్షల బోర్డును సుప్రీంకోర్టు తీవ్రంగా నిలదీసింది. పారదర్శకత లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయస్థానం, ప్రశ్నల గోప్యతపై రాతపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ ఆరాధే నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు సోమవారం స్పష్టం చేసింది. పరీక్షల పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉందని బోర్డు వాదించింది.