చిత్తూరు ప్రగతికి రూ.952.26 కోట్ల SASCI నిధులు మంజూరు
రిపోర్టర్: విజయ్
స్థలం: Chittoor
చిత్తూరు జిల్లా ప్రగతి కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రూ.952.26 కోట్ల SASCI నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో జిల్లావ్యాప్తంగా డిజిటల్ విద్య, ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ కాంప్లెక్సులు, రహదారుల విస్తరణ, రిజర్వాయర్ల అభివృద్ధి వంటి కీలక మౌలిక వసతుల కల్పనకు ఊతం లభించనుంది. దీని ద్వారా ప్రాంతీయ అభివృద్ధి మరింత వేగవంతం కానుందని అధికార వర్గాలు వెల్లడించాయి.