ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సామ రామ్మోహన్ రెడ్డి 2003లో ఎన్ఎస్ యూఐ ద్వారా పార్టీలో ప్రస్థానం ప్రారంభించారు. హైకోర్టు న్యాయవాది అయిన సామ.. రంగారెడ్డి డీసీసీ జనరల్ సెక్రటరీ, యూత్ కాంగ్రెస్ తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. 2019 నుంచి పీసీసీ అధికార ప్రతినిధిగా సేవలందిస్తూ 2024లో టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ఛైర్మన్ అయ్యారు.