రాజ్యాంగ పరిరక్షణ పోరాటం మొదలైందంటూ కేంద్ర సర్కార్‌పై రాహుల్ గాంధీ ధ్వజం
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
భారత రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య పరిరక్షణ అందరి బాధ్యత అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ ప్రజలకు న్యాయం చేకూర్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం పునరుద్ధరించే ఈ పోరాటం ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని వెల్లడించారు. దేశద్రోహులకు తగిన శిక్ష తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. ఈ ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.