మిలియన్ డాలర్లకు ఒక్క డాలర్ తక్కువగా కాంట్రాక్ట్ కుదుర్చుకున్న కెల్సీప్లమ్
రిపోర్టర్: హరి
స్థలం: World
లాస్ ఏంజెల్స్ స్పార్క్స్ స్టార్ బాస్కెట్‌బాల్ ఆటగాడు కెల్సీప్లమ్ తన కొత్త కాంట్రాక్ట్ విషయంలో అందరినీ ఆశ్చర్యపరిచారు. మిలియన్ డాలర్ల శ్లాబ్ ట్యాక్స్ నివారించడానికి, అలాగే తన జీతంలో కేవలం ఒక డాలర్ తగ్గించుకుని 9,99,999 డాలర్లకు ఒక ఏడాది కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు. జట్టులో వేతన పరిమితిని కాపాడటంతో పాటు పన్నుల భారం తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.