ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఖమ్మం రూరల్

ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఖమ్మం రూరల్ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు ఘనంగా శంకుస్థాపనలు చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు డివిజన్లలో రూ.79 కోట్ల 79 లక్షలతో వివిధ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.