స్థానిక పోరులో నూతన సమీకరణాలు: జనసేన నలభై శాతం సీట్ల డిమాండ్

రిపోర్టర్: సతీష్ స్థలం: అమరావతి

అమరావతిలో అధికార కూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ అత్యంత కీలక దశకు చేరుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎన్డీయే కూటమి అగ్రనేతలు క్యాంపు కార్యాలయంలో మరోమారు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అలాగే బీజేపీకి చెందిన కీలక నాయకులు పాల్గొని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు.