రాష్ట్రంలో తొలిసారిగా వ్యాసరచన పోటీలు: లోక్ భవన్ సంచలన ప్రకటన
రిపోర్టర్: సునీల్
స్థలం: Kolkata
పశ్చిమ బెంగాల్ లోని లోక్ భవన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం తొలిసారిగా రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ మేరకు పదవ తరగతి నుంచి విశ్వవిద్యాలయ విద్యార్థుల వరకు ప్రత్యేక అంశాలపై పోటీలు ఉంటాయని తెలిపారు. అయితే ఈ పోటీల అంశాలపై తృణమూల్ కాంగ్రెస్ మరియు సిపిఐఎం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గవర్నర్ రాజకీయ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని నేతలు ఆరోపణలు గుప్పించారు.