ఆదివాసీలపై అటవీ అధికారుల వేధింపులు: ప్రభుత్వంపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి మండిపాటు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Kumuram Bheem Asifabad
అమాయక ఆదివాసీలపై అటవీ శాఖ అధికారులు తీవ్ర ఆగడాలకు తెగబడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి మండిపడ్డారు. కుమ్రం భీం వర్ధంతి సభలో ఆమె మాట్లాడుతూ, మనుషుల ప్రాణాల కంటే జంతువులకే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ధ్వజమెత్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిధుల కేటాయింపులో తీవ్ర వివక్ష చూపుతున్నారని, మౌలిక వసతులు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించలేని మంత్రి పదవులు దండగని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.