స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్న వైఎస్ జగన్

రిపోర్టర్: కృష్ణ స్థలం: తాడేపల్లి

ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యలయంలో రీజనల్ కో-ఆర్డినేటర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి భేటీలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా భవిష్యత్ కార్యాచరణను చర్చించామని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆయన కోరారు.