స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ బందోబస్తు: నవంబర్ 1న పోలింగ్
రిపోర్టర్: సునీల్
స్థలం: అమరావతి
నవంబర్ 1న జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ముప్పై ఆరు వేల మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై ఉక్కుపాదం మోపుతూ ఇప్పటికే వందలాది కేసులు నమోదు చేశామని చెప్పారు. అసాధారణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు లక్ష మందికి పైగా వ్యక్తులను బైండోవర్ చేశామని, అక్రమ నగదు మరియు మద్యం భారీగా స్వాధీనం చేసుకున్నామని అధికారులు పేర్కొన్నారు.