ఆదిలాబాద్ లో వైభవంగా గిరిజన క్రీడా పోటీలు: ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డివిజన్ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమైనట్లు ఐటీడీఏ డీఈవో గోడం చందన్ తెలిపారు. మంగళవారం ప్రారంభమైన ఈ పోటీల్ లో 14 ఆశ్రమ పాఠశాలలకు చెందిన 250 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్, వాలీబాల్, చదరంగం వంటి వివిధ క్రీడాంశాల్ లో పోటీలు నిర్వహించారు. క్రీడా స్ఫూర్తితో రాణించి భద్రాచలంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని విద్యార్థులకు ఆయన సూచించారు.