నర్సంపేటలో ఈనెల ముప్పైవ తేదీన భారీ మహాసదస్సు నిర్వహణ
రిపోర్టర్: శేఖర్
స్థలం: నర్సంపేట
నర్సంపేటలో ఈనెల ముప్పైవ తేదీన ఐఎంఏ హాల్లో నిర్వహించనున్న ఎమ్మార్పీఎస్ మహాసదస్సు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. దళితరత్న కల్లెపెల్లి ప్రణయ్ దీప్ మాదిగ మాట్లాడుతూ యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సదస్సు ద్వారా పలు ప్రజా సమస్యలపై చర్చిస్తామని తెలిపారు.