పోషకాహార ప్రాముఖ్యతపై ముత్యాలపేటలో అంగన్వాడీల చైతన్య కార్యక్రమం
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
వెంకటాచలం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో 9వ జాతీయ పోషణ మాస కార్యక్రమంలో భాగంగా పొదలకూరు మండలం మర్రిపల్లి సెక్టార్ పరిధిలోని ముత్యాలపేట అంగన్వాడీ కేంద్రంలో సోమవారం పోషకాహార అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి తల్లి ఇంట్లో సాధారణంగా వండే ఆహారంలోనే ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయని, పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవడం వల్లే ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. నా భోజనం నా ఆరోగ్యం అనే నినాదంతో అవగాహన కల్పించారు.