'అత్యవసర సమయంలో ఈ నంబర్లకు ఫోన్ చేయండి': మహిళలు, పిల్లల రక్షణపై పోలీసుల అవగాహన
రిపోర్టర్: వెంకట్
స్థలం: Amaravati
బాలల హక్కులు, బాల కార్మిక వ్యవస్థ, పోక్సో చట్టం, ఈవ్ టీజింగ్, మహిళలపై నేరాలు, డ్రగ్స్ దుష్పరిణామాలు మరియు శక్తి యాప్‌పై ఏపీ పోలీసులు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే తక్షణ సహాయం కోసం ప్రజలు 112, 181, 1930, 1098, 1972 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు, మహిళలు మరియు పిల్లల రక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.