అమెరికా షరతులు అంగీకరించే వరకు హర్మూజ్ జలసంధి తెరవబోం
రిపోర్టర్: గోపి
స్థలం: అమెరికా
అమెరికా తమ షరతులను అంగీకరించే వరకు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవబోమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ గాలిబాఫ్ స్పష్టం చేశారు. అమెరికా సైనిక చర్యకు దిగితే మధ్యప్రాచ్యంలోని ఆ దేశ స్థావరాలపై దాడులు చేస్తామని కతామ్ అల్-అన్బియా హెడ్‌క్వార్టర్స్ హెచ్చరించింది. సముద్ర ఆంక్షల్లో భాగంగా అమెరికా బలగాలు ఇప్పటివరకు 109 వాణిజ్య నౌకలను మళ్లించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి.