గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు

రిపోర్టర్: రమేష్ స్థలం: ప్రొద్దుటూరు

గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీతో ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల జీవన్ మిషన్ రెండు పాయింట్ సున్నా అమరజీవి జలధార పథకానికి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.