భారీ ఓటమికి కారణాలపై న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ సంచలన వ్యాఖ్యలు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: Auckland

భారత్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో లక్ష్యాన్ని కాపాడుకోవడంలో తడబడుతుండటానికి మ్యాచ్ సమయాలు, పిచ్ పై తేమ ప్రధాన కారణమని న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ వెల్లడించారు. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో కివీస్ 185 పరుగులకే కుప్పకూలిందని, ఈడెన్ పార్క్ లో ఈ స్కోరు అసలు సరిపోదని ఆయన స్పష్టం చేశారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేయడం, రెండో ఇన్నింగ్స్ లో తేమ ప్రభావం వల్ల ప్రత్యర్థికి అనుకూలంగా మారుతోందని డఫీ తెలిపారు.