పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్లో భారత్కు వ్యూహాత్మక భాగస్వామ్య హోదా

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూయార్క్

పసిఫిక్ ద్వీప దేశాలతో భారత్ సంబంధాల్లో మరో కీలక ముందడుగు పడింది. పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్లో భారత్కు వ్యూహాత్మక భాగస్వామ్య హోదా లభించిందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. న్యూయార్క్లో జరిగిన భారత్-ఎఫ్ఐపీఐసీ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన సహ అధ్యక్షత వహించారు. పీఐఎఫ్ సెక్రటరీ జనరల్ బారన్ వాకా నుంచి ఈ మేరకు తనకు లేఖ అందిందని తెలిపారు. ఈ హోదాతో ఆ ప్రాంతంతో సహకారం మరింత విస్తరిస్తుందని జైశంకర్ స్పష్టం చేశారు.