ఏపీలో వైవిధ్యభరితంగా గణేశ్ విగ్రహాలు, భక్తులను ఆకట్టుకుంటున్న ప్రత్యేక ప్రతిమలు

రిపోర్టర్: నరేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడలో 72 అడుగుల పంచముఖ వరసిద్ధి మహాగణపతి, చాక్లెట్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గుంటూరులో వన వినాయకుడు, సత్తెనపల్లిలో రెండు టన్నుల బెల్లంతో చేసిన విగ్రహం ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంలో కొబ్బరి బోండాలు, కాకినాడలో జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్, విశాఖలో కోటి గాజులతో భారీ గణనాథులను కొలువుదీర్చారు. పర్యావరణ హితంగా విభిన్న రూపాల్లో స్వామివారిని పూజిస్తున్నారు.